Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Saturday, September 28, 2013

1వ దినవృత్తాంతములు 24

1Ch 24:1   
1Ch 24:2  నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియా జరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి. 
1Ch 24:3  దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను. 
1Ch 24:4  వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమ పితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో ఎనిమిదిమంది తమ తమ పితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి. 
1Ch 24:5  ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి. 
1Ch 24:6  లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదు టను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతా మారు పేరటను తీయబడెను. 
1Ch 24:7  మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదా యాకు, 
1Ch 24:8  మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీము నకు, 
1Ch 24:9  అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు, 
1Ch 24:10  ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు, 
1Ch 24:11  తొమ్మిదవది యేషూవకు పదియవది షెకన్యాకు పదకొండవది ఎల్యాషీబునకు, 
1Ch 24:12  పండ్రెండవది యాకీమునకు, 
1Ch 24:13  పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబునకు, 
1Ch 24:14  పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు, 
1Ch 24:15  పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు, 
1Ch 24:16  పందొమ్మిదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు, 
1Ch 24:17  ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు, 
1Ch 24:18  ఇరువది మూడవది దెలాయ్యాకు, ఇరువదినాలుగవది మయజ్యాకు పడెను. 
1Ch 24:19  ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను. 
1Ch 24:20  శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును, 
1Ch 24:21  రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును, 
1Ch 24:22  ఇస్హారీ యులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును, 
1Ch 24:23  హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును, 
1Ch 24:24  ఉజ్జీయేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో షామీరును, 
1Ch 24:25  ఇష్షీయా సంతతిలో జెకర్యాయును, 
1Ch 24:26  మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును. 
1Ch 24:27  యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ. 
1Ch 24:28  మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి. 
1Ch 24:29  కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు. 
1Ch 24:30  మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు, వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీ యులు. 
1Ch 24:31  వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి. 

No comments:

Post a Comment